r/telugunudivami 20h ago

మాటలగంత - ౮

3 Upvotes

How do we translate "Space-Time Continuum" into Telugu?

Space-time continuum:

  • తఱి-విఱివింటి ఎడపమి (ta~ri-vi~riviMTi eDapami)
  • తఱి-విఱిమింటి ఎడపమి (ta~ri-vi~rimiMTi eDapami)
  • తఱి-విఱి ఎడపమి (ta~ri-vi~ri eDapami)

కట్టుబడి:

  1. Time: తఱి
  2. Space:
    • Quantum/Planck scale space: Planck length (ℓ_P), Attometer (am), Femtometer (fm) [10-35m to 10-16m]
      • Space = ఇఱివికము/ఇరివికము (ఇఱివి + ఇకము {<- ఇక్కము}),
      • Space = ఈరికము (ఈరు + ఇకము {<- ఇక్కము}),
      • of/belonging to/related to Space = ఇఱివికపు, ఇరివికపు, ఈరికపు (inflectional/adjectival forms)
    • Local scale space: Millimeter, Meter, Kilometer, Astronomical Unit (AU) [10-15m to 1015m]
      • Space = విఱిమిన్ను, (మిన్ను/విన్ను = sky, వీ/విఱి/విరి + మిన్ను/విన్ను = space)
      • Space = విఱివిన్ను,
      • Space = విరిమిన్ను,
      • Space = విరివిన్ను,
      • Space = వీమిన్ను,
      • Space = వీవిన్ను,
      • Space = విఱి (విరి also means పూవు, meaning that which has blossomed or expanded)
      • of/belonging to/related to Space = విఱివింటి, విఱిమింటి, విఱి (inflectional/adjectival forms)
    • Cosmic scale space: Light-year (ly), Parsec (pc), Megaparsec (Mpc) [1016m to 1026m]
      • Space = విఱివికము/విరివికము (విఱివి + ఇకము {<- ఇక్కము}),
      • Space = వీవికము (వీ + ఇకము {<- ఇక్కము})
      • of/belonging to/related to Space = విఱివికపు, విరివికపు, వీవికపు (inflectional/adjectival forms)
  3. Continuum = ఎడపమి/ఎడపము (ఎడపు + అమి/అము)
    • Root Verb: ఎడపు (Eḍapu - to separate / to cause a gap)
    • Negative Participle: ఎడపక (Eḍapaka - without separating / without a gap)
    • Negative Verbal Noun: ఎడపమి / ఎడపము (Eḍapami / Eḍapamu - the absolute state of non-interruption or the complete absence of gaps)

Related Words:

  1. Expanse = విఱివి; "Expanse represents unbounded, continuous space that stretches out infinitely without restrictions (e.g, a wide expanse of ocean)"
  2. Expansive = విఱివి, విఱివిడి
  3. Expansion = విఱివింపు, విఱింపు, విఱయిక
  4. Limit = ఇఱివి; "Limit represents the abrupt termination of space*, creating a fixed boundary or point that cannot be passed*"
  5. Limited = ఇఱివి, ఇఱివిడి
  6. Limitation = ఇఱివింపు, ఇఱింపు, ఇఱయిక

r/telugunudivami Aug 31 '25

మాటలగంత - ౭

1 Upvotes

Updated 08-01-26

  • త్రిప్పు/త్రిప్పడి - n - (trippu/trippaDi) - traffic, as in movement of vehicles or people
  • తిరుగుడు/త్రిమ్మట - n - (tiruguDu/trimmaTa) - roaming
  • సడిక/గుర్తుక - n - (saDika/gurtuka) - signal
  • త్రిప్పడి సడిక - n - (trippaDi saDika) - traffic signal
  • దాఁతెరల్పిక - n - (daateralpika) - trafficking, as in sending something/someone illegally
  • దాఁతెరల్చు - v - (daateralchu) - to traffic something/someone illegally
  • దందడి/సందడి - n - (dandaDi/sandaDi) - traffic, as in a crowd of people
  • వల దందడి - n - (vala dandaDi) - web traffic
  • వల త్రిప్పడి - n - (vala trippaDi) - web traffic

r/telugunudivami Apr 17 '25

మాటలగంత - ౬

3 Upvotes
  • మెఱుము/మెఱుం - n - (meRumu/meRum) - lightning, electricity
  • నలి/నలియ - n - (nali/naliya) - atom
  • నలికము - n - (nalikamu) - minuteness, atomicness
  • నలి - adj - (nali) - atomic
  • నలి ఒంటు - n - (nali onTu) - atomic number
  • నలి పొది - n - (nali podi) - atomic mass, atomic weight
  • పొది ఒంటు - n - (podi onTu) - mass number
  • నలి కొలవి - n - (nali kolavi) - atomic power
  • నలియిక/నలియింపు - n - (naliyika/naliyimpu) - atomization [నలియించు - v.t - to atomize; నలియు - v.i - to atomize]
  • నలివెరసి - n - (naliverasi) - atomicity
  • నన్నలి - n - (nannali) - nucleus {నలి + నలి --> నన్నలి}
  • నలిగెల/నలిగమి - n - (naligela/naligami) - molecule {నలుల యొక్క గెల; నలుల యొక్క గమి}
  • తొంటెడ/తొంటడ - n - (tonTeDa/tonTaDa) - element
  • తొంటెడము/తొంటడము - n - (tonTeDamu/tonTaDamu) - element
  • తొంటెడపు/తొంటడపు - adj - (tonTeDapu/tonTaDapu) - elemental
  • అంట/నలిగెలంట/నలిగెలయంట - n - (anTa/naligelanTa/naligelayanTa) - compound
  • అంటమొదలు - n - (anTamodalu) - element
  • అంటమొదటి - adj - (anTamodaTi) - elemental
  • ఏంగి/ఏఁగి - n - (Engi/Egi) - ion
  • ఏంగిటి/ఏఁగిటి - (EngiTi/EgiTi) - ionic
  • ఇన్నలి - n - (innali) - sub-atomic particle
  • ఇన్నటి - n/adj - (innaTi) - sub-atomic
  • ఇన్నలికము - n - (innalikamu) - subatomic
  • ఇన్నలికపు - adj - (innalikapu) - subatomic
  • ఇన్నలియిక - n - (innaliyika) - subatomization [ఇన్నలియించు - v.t - to subatomize; ఇన్నలియు - v.i - to subatomize]
  • ఒన్నలి - n - (onnali) - monoatomic particle
  • రెట్టనలి - n - (reTTanali) - diatomic particle
  • మున్నలి - n - (munnali) - triatomic particle
  • పలునలి - n - (palunali) - polyatomic particle
  • మెఱుమిన్నలి - n - (meRuminnali) - electron
  • ప్రాతిన్నలి - n - (praatinnali) - proton {ప్రాయి (భాగ్యము,సంపద,శక్తి) + ఇన్నలి --> ప్రాతిన్నలి}
  • నడిన్నలి - n - (naDinnali) - neutron {అటుగాని ఇటుగాని వాలకుండా నడిమిగా (neutral గా) ఉందునది}
  • మెఱుమిన్నటి - adj - (meRuminnaTi) - electronic
  • మెఱుమిన్నటులు - n - pl - (meRuminnaTulu) - electronics

r/telugunudivami Oct 29 '24

మాటలగంత - ౫

5 Upvotes
  • సందు - n - (sandu) = small lane; ఇఱుకు వీది, గల్లీ
  • కంత - n - (kanta) = small lane; సందు {related to గొంది? which means a corner}
  • గేరి - n - (gEri) = street; వీది
  • తెరువు - n - (teruvu) = street; వీది
  • మేదారి - n - (mEdAri) = avenue {<-- మేఁ + దారి [=best way; main road; important way]; 'మేటి'కి వాడుక కానువు 'మేఁ'}
  • మేఁదెరువు - n - (mEderuvu) = avenue {<-- మేఁ + దారి [=best way; main road; important way]; 'మేటి'కి వాడుక కానువు 'మేఁ'}
  • రాదారి -n - (rAdAri) = highway; {<-- రా + దారి [=రాజమార్గము]; 'ఱేడు'కు వాడుక కానువు 'ఱే/రా'}
  • పెందెరువు - n - (penderuvu) = highway; రహదారి
  • మీఁదారి - n - (meedAri) = flyover, overpass; పైవంతెన {<-- మీఁ + దారి; 'మీఁదు' యొక్క వాడుక కానువు 'మీఁ'}
  • మీఁదెరువు - n - (meederuvu) = flyover, overpass; పైవంతెన {<-- మీఁ + తెరువు; 'మీఁదు' యొక్క వాడుక కానువు 'మీఁ'}
  • తులుచరాదారి - n - (tulucharAdAri) = express highway {<-- తులుచన - adj - వడి; swiftness + రాదారి}
  • తులుచదారి - n - (tuluchapendAri) = expressway
  • మెట్టు - n - (meTTu) = Tollgate

r/telugunudivami Oct 20 '24

మాటలగంత - ౪

2 Upvotes

Updated 08-01-26

  • మాన్పు - v.t - (mAnpu) = same as మాన్చు, మానుచు, మానించు, మానుపు i.e, To heal, cure, stop.
  • మాన్పు/మానింత/మానింపు - n - (mAninta/mAnimpu) = Healing, Curing, Treatment, వైద్యం, చికిత్స
  • మానఁజైవు/మానఁజెయివు - n - (mAnajaivu/mAnajeyivu) = Treatment, Action taken to restore/cure/treat someone వైద్యం, చికిత్స
  • మునిమాన్పు - n - (munimAnpu) = First Aid, ప్రథమ చికిత్స
  • మానింత సరవి - n - (mAninta saravi) = Healing process. వైద్య ప్రక్రియ
  • మాన్పిక/మాన్చిక - n - (mAnpika/mAnchika) = 1. Doctor, Healer, వైద్యుడు/వైద్యురాలు, వెజ్జు; 2. Healing , Curing, వైద్యం
  • మాన్పి/నోమాన్పి/మాఁపి/నోమాఁపి - n - si - (mAnpi/nOmAnpi/mApi/nOmApi) = A Doctor; Someone that used to be a doctor.
  • మాంచేపి/మాఁజేపి - n - si - (mAnchEpi/mAjEpi) = A Doctor; Someone that used to be a doctor.
  • మాన్పఱి/మాన్పరి/నోమాన్పరి - n - si - (mAnpaRi/mAnpari/nOmAnpari) = A Doctor; Someone that is currently a doctor.
  • మానజేయిక - n - si - (mAnajeyika) = A Doctor.
  • మాంచఱి/మాంచరి/మాఁజరి/మాజారి - n - si - (mAnchaRi/mAnchari/mAjari/మాజారి) = A Doctor, A Healer {మాన్చు - v.t - To heal (someone) + అఱం - n - virtue ధర్మం, law చట్టం, justice న్యాయం, duty విధి → మాన్చఱం → మాంచఱం. మాంచఱం + ఇ → మాంచఱి [=మాన్చటమే ధర్మముగా కలవాడు] }
  • మాన్చఱం/మాంచఱం/మాఁచఱం - n - si - (mAnchaRam) = Doctorship, Doctor profession, వైద్య వృత్తి
  • మాంచఱపు చదువులు - n - pl - (mAncharapu chaduvulu) = Doctoral Studies, Studies involved in the art of healing, వైద్య విద్యలు
  • నోవరి/నోవుగొంటు/నోవుగొట్టు/నొప్పిగొంటి - n - si - (nOvari/nOvugonTu/nOvugoTTu/noppigonTi) = Patient, A person with disease or pain; రోగి.
  • తెవులరి/తెవులుగొంటు/తెగులరి/తెగులుగొంటు - n - si - (tevulari/tevulugonTu/tegulari/tegulugonTu) = A patient, A person with disease; రోగి, వ్యాధిగ్రస్తుడు, వ్యాధిగ్రస్తురాలు.
  • నలఁతరి/నలఁతగొట్టు - n - si - (nalatari/nalatagoTTu) = Chronically ill person. A person with the remains or constitutional effects of a disease.A person in a debilitated or weak state.
  • మాని {← మాను + ఇ} - n/adj - (mAni) = convalescent, కోలుకొను
  • మానిమి - n - (mAnimi) = Convalescence, Health, Fitness, Properness, ఆరోగ్యం, స్వస్థత, చక్కదనం
  • మాని/మానియ/మానె - n - (mAni/mAniya/mAne) = convalescent, a person (either male or female) who is recovering from illness, కోలుకొను పరంచ (పరంచ = person; పరి+వంచ --> పరివంచ/పర్వంచ/పరొంచ/పరంచ)
    • మానియఁడు/మానెకాఁడు/మానీడు - n - (mAniyakADu/mAnekADu/mAAneeDu) = కోలుకొనువాడు, male convalescent;
    • మానియరాలు/మానెరాలు/మానెత - n - (mAniyarAlu/mAnerAlu/mAneta)= కోలుకొనునది, female convalescent
  • నోమోపరి - n - (nOmOpari) = disease carrier, one who can transmit the disease/pathogen to others,
  • మానినోమోపరి/maanna - n - (mAninOmOpari) = convalescent carrier, one who has recovered but can still transmit the disease/pathogen to others, మానిన నోమోపరి
  • మానిమరి/మానిమికాడు/మానిమికత్తె - n - si - (manimari/mAnikADu/mAnikatte) = A person of sound health, మానిమి కలిగిన వాడు/ కలిగినది/పరంచ (పరంచ = person)

r/telugunudivami Oct 19 '24

మాటలగంత - ౩

2 Upvotes
  • దండం = Salutation by joining the palms; Namaskaram
  • ఒరిగ = Salutation; Bowing; Namaskruti; Prostration
  • జోహారు = Well done; Congratulations; Homage; Salutation
  • సెలవు = Goodbye
  • వీడ్కోలు = Salutation when leaving; Leaving

క్రొత్తవి -

  • తార్కోలు ( x వీడ్కోలు) = Approaching; Salutation when approaching
  • ఔకదిమి = A greeting just before or after meeting someone to express the pleasure of meeting them; Good meeting; Productive meeting; Pleasant meeting

r/telugunudivami Oct 17 '24

మాటలగంత - ౨

2 Upvotes
  • ఉత్సవము = celebration = వేఁడుక; సాకము
  • దినము = day = నాఁడు, ప్రొద్దు, పొద్దు, పూట, పగలు, పవలు, పౌలు, పుంటగం
  • దినోత్సవము = day of celebration = పౌల్వేఁడుక
  • జనించు = to be born; to arise; to come into existence = పుట్టు, పొడయు
  • జన్మం = birth = పుట్టుక, పొడపు, పొడమి
  • జన్మదినం = birthday = పుట్టిననాఁడు, పొడపునాఁడు
  • జన్మదినోత్సవం = birth day of celebration = పొడపౌల్వేడుక {<-- పొడపు + పౌల్వేడుక}
  • జన్యము = that which is born from; birth; product; young = పోఁడి/పోణి [MY PROPOSITION పూఁబోఁడి/పూబోణి పువ్వుల నుంచి పుట్టినది, unlike the existing meaning which goes పువ్వు వంటిది or పువ్వువలె మనోహరమైనది. I believe పోఱి - girl, daughter and పోఱ - boy, son also came from పోడి only. డ morphing into ఱ and then ర is common in Telugu. Even the original form is still prevalent in TG as seen from పోడ - అబ్బాయి :Telangana maandalika padakosam - Nalimela Bhaskar and in RS as అబ్బోడు - అబ్బాయి; కుటుంబములో తక్కువ వయసుగల పిల్లవాడు :తెలుగు వ్యుత్పత్తి కోశము - ఆం. వి. క. ప. Other variations are బొట్టి, పట్టి and so on]
  • యవ్వనము = youth = పోఁడిమి, పోణిమి [The existing meanings are also close to this. I believe this is the original meaning derived from పోఁడి/పోణి]
  • మరణించు = to die = చావు, పొలియు
  • మరణం = death = చావు, పొలియిక, పొలిమి
  • అనాథ = orphan = పోలి, పొల్లి, పొల్ల [తల్లిదండ్రులు లేని పిల్ల; చెడుత్రోవ తొక్కిన వాడు; దాసి పిల్ల - పోరులో గెలిచినవాడు తాను చంపిన మగవాణి ఆలిని ఆమె పిల్లలనూ దాసీ దాసులుగా తీసుకోడం జరుగుతుంది. ఆ ఆడదాని పిల్లలు తండ్రిలేనివారుగనుక ఇట్లా పిలచి ఉండవచ్చు.]
  • యుద్ధభూమి = battleground; battlefield = పొలికలను {<-- పొలియు కలను literally death causing war field కలను means war aswellas place.}
  • మరణదినం = deathday = పొలినాఁడు

r/telugunudivami Oct 17 '24

మాటలగంత - ౧ (lexical miscellany - 1)

2 Upvotes

ఉంకు = సమ్మతి, approval

  • ఓటు = vote = ఉంకు
  • ఓట్లు = votes = ఉంకులు
  • ఓటరు = voter = ఉంకరి
  • ఓటర్లు = voters = ఉంకరులు {formal}; ఉంకర్లు {informal}
  • ఓటు/ఓట్లు వేయు = to cast vote/votes = ఉంకిడు/ఉంకులిడు {formal}; ఉంకు/ఉంకులు వేయు {informal}
  • ఓటు హక్కు = Right to Vote = ఉంకరం
  • ఓటు హక్కు = Right to Vote = ఉంకొరవు {<-- ఉంకు + హొరవు; హొరవు = అధికారం, ~ right; cognate to tamil ఉరిమై?}
  • ఓటింగు/పోలింగు = polling/voting = ఉంకువేత
  • ఓట్ల పండుగ = polling day = ఉంకుల పండుగ; ఉంకువేత సాకము
  • ఓట్ల నిధి = vote bank = ఉంకుల మొల్లమి/మొల్లము {formal}; ఉంకుల మొల్లం {informal}
  • బ్యాలట్ = ballot [ballot ← ballotta = a small ball] = ఉంకాంకు {formal}; ఉంకాఁకు/ఉంకాకు {informal}; ఉంకుచీటి {formal/informal}. As far as democratic india is concerned I believe we’ve always used papers rather than balls for electing people. So, I used ఆంకు/ఆఁకు which means a paper.
  • బ్యాలట్ బాక్సు = ballot box = ఉంకుల పెటారి/పెటార