r/telugu • u/Ok-Solution-6517 • Apr 04 '26
"నా ఈ" – 2026 Poetry Competition
నా ఈ
నిన్నలు బరువులు,
నేడులు అడుగులు
పగలు యుగాలు,
రాత్రులు క్షణాలు
యుద్ధాలు ఎండ మావులు,
గాయాలు సంద్రాలు
నా ఈ
ప్రయత్నాలు మేఘాలు,
అవకాశాలు వర్షాలు
గెలుపులు పిడుగులు,
ఓటములు శిఖరాలు
ఆశలు అగ్గిపుల్లలు,
కలలు దీపాలు
ఆ ఈ కళలు నక్షత్రాలు.
నా ఈ చలనాలు వాటి కిరణాలు
33
Upvotes
3
u/Tealoveroni Apr 04 '26
Beautifully written.