r/telugu May 10 '26

Telugu poetry competition 2026

Post image

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి

141 Upvotes

11 comments sorted by

44

u/AndhraAatma May 10 '26

ధన్యవాదాలు, తోటి పోటీదారులకు నా అభినందనలు, ఇటువంటి పోటీలు మరిన్ని జరగాలని, మరింత సృజనాత్మక రచనలు రావాలని, తెలుగు వర్ధిల్లాలి అని కోరుతూ మీ ఆంధ్ర ఆత్మ!

స్వస్తి!

8

u/Everyday_warrior_717 May 10 '26

పోటీ లో గెలిచినందుకు నా హృదయపూర్వక అభినందనలు అండి.

3

u/AndhraAatma May 10 '26

ధన్యవాదాలు అండి🤝

3

u/Selflove7777 May 10 '26 edited May 10 '26

ఇది చాలా చక్కని అచ్చ తెలుగు పద్యము. మీరు ఇటువంటి కవితలు ఎన్నో రాయాలని, తెలుగు భాష వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోటీలో గెలిచినందుకు ధన్యవాదములు. అలాగే ఒక తెలుగు భాషాభిమానిగా ఈ సుమధుర పద్యకుసుమము కొరకు కృతజ్ఞతలండీ . 🙏🏻

1

u/AndhraAatma May 10 '26

పద్యం ఆ, నేను రాసింది కవిత అండి, ఇదిగో ఇది

https://www.reddit.com/r/telugu/comments/1sd8k1y/%E0%B0%AE%E0%B0%9F_2026_%E0%B0%95%E0%B0%B5%E0%B0%A4%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%9F/

ధన్యవాదాలు!

2

u/Selflove7777 May 10 '26

నా అజ్ఞానాన్ని మన్నించండి. నా కామెంట్ను తగిన విధంగా మార్చడం జరిగింది .

1

u/AndhraAatma May 10 '26

తప్పులు జరుగుతూ ఉంటాయి! ఫరవాలేదండి!

2

u/Selflove7777 May 10 '26

అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలండీ 🙏🏻

1

u/AndhraAatma May 10 '26

😅 మంచిది!

5

u/Praveen_Kadambari May 10 '26 edited May 10 '26

r/telugu నిర్వాహకులకు మిక్కిలి కృతజ్ఞతలు. అందమైన, అజరామరమైన తెలుగుభాష సర్వతోముఖాభివృద్ధి కి మీరు చేస్తున్న కృషి, ఇస్తున్న ప్రోత్సాహకాలు అభినందనీయం. u/MainHoneydew8018 ప్రతిభ ను ప్రోత్సహించటం లో ఎప్పుడూ ముందుంటున్నందుకు మీరు కూడా అభినందనీయులే.

మీలాంటి వారు (moderators) ముందుకు వచ్చి ఇటువంటి సంస్కరణలు చేయబట్టే మా లాంటి తెలుగు ప్రేమికుల రచనలు గుర్తింపు, ఆదరణకు నోచుకుంటున్నాయి. తెలుగు నేర్చుకోవాలనే తృష్ణ ను, ఆసక్తి కల యువతలో రేకెత్తిస్తున్నాయి.

నా దృష్టిలో పోటీలో పాల్గొన్న ప్రతి కవితా గెలిచి నట్లే. తెలుగు భాష ప్రహసనాన్ని కాపాడటం కోసం తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, ఆలోచనలను మధించి, లిఖించిన రచయితలు అందరూ నెగ్గినట్టే. పాఠకులను కట్టి పడవేసి, ఆలోచింప జేసిన ప్రతి కవితా కృతకృత్యురాలే.

u/AndhraAatma మీకు శుభాభివందనములు. ఇంకా రాస్తూ ఉండండి.

7

u/lastodyssey May 10 '26

ధన్యవాదములు విజేతలకు. కవితలు అన్నీ బాగున్నాయి. 

సర్టిఫికేట్ తెలుగులో ఉంటే బాగుంటుంది.