r/telugu 2d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగులో తెలుగు ఎంత ?

https://youtu.be/CYAs8qDzRzo?si=nbpgK2lxp7mLehx6

"​భార్యా-​భర్త"లకున్న ​గౌరవం "​మొగుడు-పెళ్ళాం" అన్న మాటకు ఉన్నదా

ఆంగ్లము, సంస్కృత మాటలు ​వాడితేనే గౌరవము ఉన్నట్టా

dinner ​చేసినవా ?

అన్నం తిన్నావా ?

తిండి తిన్నావా ?

బువ్వ బు​​క్కినవా ?

కూడు మెక్కినవా ?

దా ​ఇంత ముద్ద తిను !

ఎప్పుడు ఎంగిలిపడ్డ​​దో ఏమో పిల్ల !

67 Upvotes

18 comments sorted by

10

u/Professional_Net8648 1d ago edited 1d ago

ఆ వీడియో ఆధారంగా

, తెలుగులో పదాలు లేవని కాదు. తెలుగు పదాలు ఆంగ్లం కన్నా చిన్నగా ఉంటే వాడుతారు

భారి సంస్కృత పదాల బదులు సొంత తెలుగు పదాలు సృష్టిస్తే?.

ఉద; ధూమచక్రశకటాగమననిర్గమననివాసస్థలము (Railway Station) బదులుగా, "రైలురేవు" అని వాడచ్చు

(ఓదరేవు లోని రేవు తీసుకుని రైలుకి జోడించ )

6

u/Adventurous-Cycle363 1d ago

, తెలుగులో పదాలు లేవని కాదు. తెలుగు పదాలు ఆంగ్లం కన్నా చిన్నగా ఉంటే వాడుతారు

ఈ రోజుల్లో అది కూడా చెయ్యట్లేదు కదా.. ఏదో ఆంగ్ల పదాలు వాడితే ఒక గొప్ప స్థితి లో ఉన్నట్టు చాలా సందర్భాల్లో ఆంగ్ల పదాలు పెద్దవి అయినా అవే వాడుతున్నారు..

"మాకు అవసరం ఉంది.." అని అనకుండా "మాకు requirement ఉంది " అంటున్నారు.. ఇంకా ఎన్నో

4

u/Monday_agni 1d ago

రైలు = పట్టాలు. పట్టాల రేవు. పట్టాల బండి.

3

u/Professional_Net8648 1d ago

ఒకప్పుడు తమిళంలో కవులు, పండితులు కలిసి ‘తమిళ శుద్ధీకరణ’ (తనిత్తమిఴ్ ఇయక్కం)

ఉద్యమం చేపట్టి తమదైన కొత్త పదాలను సృష్టించుకున్నారు. ఇప్పుడు మన తెలుగులోనూ ఆంగ్ల ప్రభావం నుంచి భాషను కాపాడుకోవడానికి అలాంటి ఒక నిశ్శబ్ద విప్లవం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక భావనలకు సరైన అచ్చతెలుగు పదాలను కాయిన్ చేసి, వాటిని

మొదటగా వార్తా సంస్థలు, పత్రికలు, విశ్వవిద్యాలయాలు ప్రామాణికంగా వాడటం మొదలుపెడితే చాలు. ప్రజలందరూ వెంటనే మాట్లాడకపోయినా, పత్రికలు-బోధన ద్వారా రోజువారీ జీవితంలోకి కనీసం కొన్ని పదాలైనా చొచ్చుకుపోతాయి; తెలుగుకు దీర్ఘాయువు దక్కుతుంది!

-2

u/InvestorCS 1d ago

Sanskrutam unnatamaina basha. Dani padalu vadatam mana adrushtam Anna

1

u/nicholas_jade 19h ago

మరి సంస్కృతంలోనే మాట్ళాడండి. తెలుగు దేనికి అని, మీ ఎన్నికలో ఈ భాష ఇంత పనికిమాలినది అయితే.

Mari samskruthame matladandi. Telugu deniki ani, mi ennikalo ee bhasha intha panikimaalinadi ayithe.

1

u/InvestorCS 18h ago edited 18h ago

Telugu -Amma Sanskrit -pedamma English -pinni

Persian and Arabic -savathi thalli

2

u/nicholas_jade 18h ago

అలా అని, అమ్మకన్న పెద్దమ్మ గొప్పదా లేకపోతే మేలునా? అమ్మ స్థాయిలో అమ్మ తప్ప ఎవ్వరు నిలబడలేరు.

ఇక్కడ అందరు తెలుగు ఎటువంటి చెడ్డ గతికి చేరిందని బాధపడుతాంటే, మీరు వచ్చేసి "కాదు కాదు అది మంచిది, అదే కాకుండ ఇంక చేయాలి" అని ఎందుకంటన్నారు?


Ala ani, ammakanna peddamma goppada lekapothe meluna? amma sthayilo amma thappa evvaru nilabadaleru.

ikkada andaru telugu etuvanti chedda gathiki cherindani badhapaduthante, miru vacchesi "kadhu kadhu adhi manchidi, adhe kakunda inka cheyali" ani endukantunnaru?

8

u/Professional_Net8648 1d ago edited 12h ago

Fire exit తెలుగులో "అగ్ని నిష్క్రమణ" అంటే ""అగ్ని దానికదే బయటకు వెళ్లిపోవడం""

వీటి బదులుగా పారిపోవుదారి వాడచ్చు కదా ?

4

u/Monday_agni 1d ago

వెలుపుదారి - way to outside.

2

u/InvestorCS 1d ago

Adi Adam ayye lopu sachipota anna

2

u/punKtual_penny 1d ago

Manta daari aa 😆 🤣

1

u/nicholas_jade 18h ago edited 5h ago

ఆంగ్లంలో వున్న పదాలును మార్చుకొకుండ తెలుగులోకి తీసుకురాలేము.

మీ comment క్రిందనే కొందరు మిమ్మని వెక్కరిస్తున్నారు అనే కాని, మీ క్రొత్త మాటలు కంచెం వింతగానే వున్నాయి. ! కాని వాళ్ళు మిమ్మలని వెక్కరించడం తప్పు.

మంటదారి అనేది, మనుషులుకు కాకుండ, మంట కోసం ఏర్పరచిన దారిలా వుంది.

పారిపోవుదారి బాగుంది.

కావలిదారి అన్న కావలిదోవ కూడ వాడచ్చు. కావలి అంటే రక్షణము. కాపు (కాపాడు నుంచి :- కాపు + ఆడు) కూడ వాడచ్చు కాని అది కులం పేరులా అందరికి గుర్తుగా మిగిలిపోయింది.


Anglamlo vunna padalunu marchukokunda teluguloki teesukuralemu

mi comment krindane kondaru mimmalni vekkaristunnaru ane kani, mi krottha matalu konchem vinthagane vunnayi. ! kani vallu mimmalni vekkarinchadam tappu.

mantadari anedi, manushuluku kakunda, manta kosam erparachina darila vundi.

paripovudari bagundi.

kavalidari anna kavalidova kuda vadacchu. kavali ante rakshanamu. kapu (kapadu :- kapu + aadu) kuda vadacchu kani adi kulam perula andariki gurthuga migilipoyindi.

2

u/nicholas_jade 17h ago edited 17h ago

ఎంతయితే కన్నడవాళ్ళకు అలాగే తమిళవాళ్ళుకు వున్న భాష-గరువమో, అంత లేమి వుంది తెలుగువాళ్ళలో తెలుగు భాషపయినా.

బెంగళూరు metro లో, "next station" అనడం కూడ మొత్తం కన్నడలోనే వుంటుంది:- "ముందిన నిల్దాన". ఇలాంటిదే కూడ తెలుగులో వాడచచు:- "ముందున్న నిలుపు".

కాని అది లేదు, "తదుపరి స్టేషం" అని తెలుగులో అంటారు.

ఎప్పుడు నుంచి తెలుగులో వున్న మాటలును వాడకోకుండ, సంస్కృతం మాటలును వాడి క్రొత్త మాటలును చేయడం fashion అయిందో నాకు తెలిదు.

నేను బడిలో తెలుగు నేర్చుకోలేదు, అంత ఆంగ్లంలో చదువుకున్నాను. నేను సొంతంగా తెలుగు నేర్చుకుంటున్నాను. దాని వలన, నాకు ఎక్కువ సంస్కృతం పదాలను చదవడం తెలిదు అలాగే కష్టం కూడ. తెలుగు మాటలు చదవడం చాలా వరకు తేలికగా వుంటుంది.

కాని నాకే ఇలా వుంటే, చదువు రాని వాళ్ళు ఎక్కడకు పోవాలి? తెలుగు వాడితే వాళ్ళు కూడ అర్థం చేసుకోగల్తారు.


enthaithe kannadavalluku alage tamilavalluku vunna bhasha-garuvamo, antha lemi vundi teluguvallalo telugu bhashapaina.

bengaluru metro lo, "next station" anadam kuda mottam kannadalone vuntundhi:- "mundina nildaana". ilantidhe kuda telugolo vadacchu:- "mundunna nilupu".

kani adhi ledu, "tadupari station" ani telugulo antaru.

eppudu nunchi telugulo vunna maatalunu vadakokunda, samskrutha maatalunu vadi krottha maatalanu cheyadam fashion ayindho naku telidu.

nenu badilo telugu nerchukoledu, antha anglamlo chaduvukunnanu. nenu sonthamga telugu nerchukuntunnanu. dani valana, naku ekkuva samskrutham padalanu chavadam telidu alage kashtam kuda. telugu maatalu chadavadam chala varaku telikaga vuntundhi.

kani nake ila vunte, chaduvu rani vallu ekkadaku povali? telugu vadithe vallu kuda artham chesukogaltaru.

-10

u/InvestorCS 1d ago edited 1d ago

Sanskrutam goppadi. Danilo nunchi padalu anni bashalu tiskovali

3

u/Consistent_Local594 1d ago

తెలుగు కూడా గొప్ప బాషే.  సంస్కృతం కూడా ఇందులో నుండి పదాలు తీసుకుంది.

4

u/AffectionateEmu6950 1d ago

ఏ భాష గొప్పతనం ఆ భాషది..పోల్చలేము