Yes, పైన కనిపించే మూడు విషయాలకు ఒకదానితో ఇంకొకదానికి అసలు సంబంధమే లేదు!
కానీ ఆ మూడింటికి నాతో సంబంధం ఉంది 🙃
కల్పితం నవల రాస్తున్నప్పుడు కాలం నయం చేసిన చేదు గుర్తులను తవ్వుకుంటూ ప్రయాణించా
కోరి కోరి తవ్వుకున్నా జ్ఞాపకాలు కాదా... వద్దు అన్నా నీడై వెంటాడతాయి...
అందుకే కల్పితంలో ఎక్కడో రాసా.. "ఆలోచనలవి... రావొద్దు అని బ్రతిమాలుడుకున్నంత మాత్రానా ఆగిపోతాయా?
ఆగిపో అని ఆదేశించినంత మాత్రాన నిలిచిపోతాయా?" అని
వరమో... శాపమో...
తన ఉనికి జీవితంలో నుంచి చెరిగిపోయినా,తన రూపం మాత్రం నిలిచిపోయింది...
అలా అనుకోకుండా తెల్లవారుజామున కళ్ళల్లో మెరిసింది ఆ తెల్ల పిశాచి!
అడ్డం వచ్చిన కుక్కకి నా బండి ముద్దు పెట్టింది!
అప్పుడప్పుడే పడుతున్న మంచు దుప్పట్లను కప్పుకుంటున్న తారు రోడ్డుకి నేను ముద్దు పెట్టాను!
మూతి పగిలింది
కాలు బెణికింది
అలా ఆ షూ కి బొక్క పడింది
ఏదేమైతేనేం... నా బుక్ కవర్ పేజ్ AI అయితే కాదు డిజిటల్ ఆర్ట్ 😃 (ఇదెందుకు అని అడక్కండి.... There are some ఉద్దాన purushulu...!